Share News

China : ఒప్పందాలు లెక్కచేయని చైనా

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:07 AM

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా చైనా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దులోని డెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ నుంచి సైనిక దళాలను ఉపసహరించాలని గత అక్టోబరులో ఇరు దేశాల మధ్య

China : ఒప్పందాలు లెక్కచేయని చైనా

ఎల్‌ఏసీ వెంబడి సైనిక కార్యకలాపాల విస్తరణ

న్యూఢిల్లీ, జనవరి 29: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా చైనా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దులోని డెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ నుంచి సైనిక దళాలను ఉపసహరించాలని గత అక్టోబరులో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య చర్చల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ చైనా దానిని పట్టించుకోవడంలేదు. దౌత్యపరంగా చర్చలను కూడా లెక్కచేయడంలేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లడఖ్‌ వరకు ఎల్‌ఏసీ వెంబడి మూడు సెక్టార్‌లలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, బ్రిడ్జిలు, హెలీప్యాడ్‌లు, మిలిటరీ స్థావరాలను విస్తరిస్తూనే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా ఆర్మీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని భారత మిలిటరీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తూర్పున ఉన్న రోంగ్తోచు, ఇతర ప్రాంతాల్లో ఆ పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇక్కడి సరిహద్దు గ్రామాల నుంచి ఎల్‌ఏసీ వరకు కొత్తగా సిమెంట్‌ రోడ్లు, మిలిటరీ క్యాంపులను చైనా మిలిటరీ నిర్మిస్తోందని వివరించారు. అవసరమైతే పెద్దఎత్తున దళాలను సరిహద్దు వద్దకు తరలించేందుకు ఈ పనులు కొనసాగిస్తోందన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:07 AM