Waqf Amendment Bill: ‘వక్ఫ్’ జేపీసీ భేటీలో రచ్చ
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:00 AM
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో శుక్రవారం పెద్దఎత్తున గందరగోళం చెలరేగింది. చైర్మన్ జగదంబికాపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు.

ఒవైసీ, రాజా సహా 10 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో శుక్రవారం పెద్దఎత్తున గందరగోళం చెలరేగింది. చైర్మన్ జగదంబికాపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి హడావుడిగా సమావేశాలు, చర్చలు పెట్టి ఆదరాబాదరాగా నివేదిక ఇవ్వాలని అధికార పక్ష సభ్యులు చూస్తున్నారని విమర్శించారు. చైర్మన్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో కల్యాణ్ బెనర్జీ, నదీమ్ ఉల్ హక్(టీఎంసీ), అసదుద్దీన్ (ఎంఐఎం), ఎ.రాజా, ఎం.అబ్దుల్లా (డీఎంకే), మహ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), అరవింద్ సావంత్ (ఉద్ధవ్ శివసేన), మొహీబుల్లా(ఎ్‌సపీ)లను సమావేశం నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు పాల్ ప్రకటించారు.