The Indian Ministry of Home Affairs: మిగిలింది మూడు జిల్లాలే కేంద్రం
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:41 AM
మావోయిస్టుల అత్యధిక ప్రాబల్యం ఉన్న జిల్లాల సంఖ్య ఆరు నుంచి మూడుకు, ప్రాబల్య జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు చేరుకున్నదని కేంద్ర......
మావోయిస్టుల అత్యధిక ప్రాబల్యం ఉన్న జిల్లాల సంఖ్య ఆరు నుంచి మూడుకు, ప్రాబల్య జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు చేరుకున్నదని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్‌లకు మాత్రమే నక్సల్స్ కదలికలు పరిమితం అయ్యాయని పేర్కొంది. ‘మావోయిస్టు రహిత భారతదేశ నిర్మాణం దిశగా భారీ అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు అడ్డాలు తగ్గిపోతున్నాయి’ అని కేంద్ర హోం శాఖ వ్యాఖ్యానించింది. ఈ ఒక్క ఏడాదిలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఎనిమిదిమంది పొలిట్‌బ్యూరో/కేంద్ర కమిటీ సభ్యులు సహా 312 మంది కాల్పుల్లో మరణించారని... 836 మంది అరెస్టుకాగా, 1,639 మంది లొంగిపోయారని పేర్కొంది. లొంగిపోయినవారిలో పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు ఉన్నారని వివరించింది.