Census: ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా.. ఆరు నెలలపాటు లెక్కింపు
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:54 PM
జనగణనకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల్లో జరగబోయే ఈ జనగణన 2026 అక్టోబర్ 1న ప్రారంభమై మార్చి 1, 2027న ముగియబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఢిల్లీ: జనగణనకు (Census) సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) విడుదల చేసింది. రెండు దశల్లో జరగబోయే ఈ జనగణన 2026 అక్టోబర్ 1న ప్రారంభమై మార్చి 1, 2027న ముగియబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మన దేశంలో జరగబోయే 16వ జనగణన. స్వాతంత్య్రానంతరం జరిగే 8వ జనాభా లెక్కింపుగా నిలవబోతోంది(National News).
దాదాపు ఆరు నెలలపాటు జరిగే ఈ లెక్కింపులో 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లతోపాటు 1.34 లక్షల మంది సిబ్బంది కూడా పాలుపంచుకోబోతున్నారు. ఈసారి జనగణనతోపాటు కులగణనా చేపట్టబోతున్నారు. ఇంతకు ముందులా కాకుండా ఈసారి లెక్కింపు పూర్తిగా ట్యాబ్‌ల సహాయంతో డిజిటల్ రూపంలోనే జరగబోతోంది. సమాచారం భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
అంతేకాదు ప్రభుత్వం సూచించే పోర్టళ్లు, వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటునూ కల్పించింది కేంద్రం. నిజానికి 2021లో ఈ జనగణన జరగాల్సి ఉంది. ఈ మేరకు 2019లో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కొవిడ్-19 కారణంగా ఆ జనగణనను వాయిదా వేశారు. చివరిసారి 2011లో జనాభా లెక్కింపు జరిగింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత జనగణన జరగబోతోంది.
ఇవి కూడా చదవండి..
జిప్‌లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి