Share News

Science and Technology : శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు రూ. 20 వేల కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:35 AM

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించారు. ప్రైవేట్‌ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి ఈ ఫండ్‌ కేటాయించారు. గత జులైలో

Science and Technology : శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు రూ. 20 వేల కోట్లు

న్యూఢిల్లీ, జనవరి1: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించారు. ప్రైవేట్‌ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి ఈ ఫండ్‌ కేటాయించారు. గత జులైలో నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం లక్ష కోట్ల రూపాయల ఫండ్‌ కేటాయిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మల వెల్లడించారు. బయో టెక్నాలజీ రంగానికి రూ.3,446 కోట్లు, అణు శక్తి విభాగానికి 24,049 కోట్లు, అంతరిక్ష విభాగానికి రూ.13,416కోట్లు కేటాయించారు. ఇస్రో ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా రూ.10,230 కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 02 , 2025 | 04:35 AM