Share News

రోడ్డు రవాణా, జాతీయ రహదారులకు రూ.2.87 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:34 AM

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు 2025-26 ఏడాదికి ప్రభుత్వం రూ.2.87లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. 2

రోడ్డు రవాణా, జాతీయ రహదారులకు రూ.2.87 లక్షల కోట్లు

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు 2025-26 ఏడాదికి ప్రభుత్వం రూ.2.87లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. 2024-25 ఏడాది కేటాయింపులతో పోలిస్తే ఇది 2.41 శాతం అధికం. ఇక, ఈ బడ్జెట్‌లో జాతీయ రహదారుల సంస్థ, ఎన్‌హెచ్‌ఏఐకు రూ.1878.03 కోట్లు కేటాయించింది. ఎన్‌హెచ్‌ఏఐ అప్పులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.3.35లక్షల కోట్లుగా ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ అప్పులు.. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి రూ.2.76లక్షల కోట్లకు తగ్గాయి.

Updated Date - Feb 02 , 2025 | 04:34 AM