Share News

Beti Bachao Beti Padhao: ‘బేటీ బచావో-బేటీ పడావో’కు పదేళ్లు

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:24 AM

దేశవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంతోపాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమానికి బుధవారంతో పదేళ్లు పూర్తయ్యాయి.

Beti Bachao Beti Padhao: ‘బేటీ బచావో-బేటీ పడావో’కు పదేళ్లు

న్యూఢిల్లీ, జనవరి 22: దేశవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంతోపాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమానికి బుధవారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘బాలికల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ ఉద్యమం పదేళ్లకు చేరింది. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. జిల్లాల స్థాయిలో ఒకప్పుడు బాలికల శాతం తక్కువగా ఉండేదని.. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం ద్వారా కల్పించిన అవగాహనతో ఇప్పుడు వీరి శాతం మెరుగుపడిందని, లింగ వివక్ష తగ్గుతోందని తెలిపారు. కాగా, బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాన్ని 2015, జనవని 22న ప్రధాని మోదీ హరియాణాలోని పానిపట్‌లో ప్రారంభించారు

Updated Date - Jan 23 , 2025 | 04:24 AM