CBSE to Introduce Open Book: 9వ తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:26 AM
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు: సీబీఎ్‌సఈ
న్యూఢిల్లీ, ఆగస్టు 10: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ్‌సఈ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సమావేశంలో సీబీఎ్‌సఈ గవర్నింగ్ బాడీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీనిలో భాగంగా 9వ తరగతి భాష, గణితం, సైన్స్, సోషల్ పరీక్షలు ఓపెన్ బుక్ విధానం లో నిర్వహించనున్నారు. సంబంధిత మార్గదర్శకాలను పాఠశాలలకు బోర్డు అందించనుంది. అయితే పాఠశాలల్లో దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదు. కాగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది కోసం సీబీఎ్‌సఈ ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుందని బోర్డు అధికారులు తెలిపారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆడియో కంటెంట్ అందించడానికి సీబీఎ్‌సఈ ఇప్పటికే ‘శిక్షా వాణి’ పేరిట పాడ్‌కా్‌స్టను నిర్వహిస్తోంది.