Share News

Diabetes Awareness: పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించండి

ABN , Publish Date - May 18 , 2025 | 05:41 AM

పిల్లల్లో పెరుగుతున్న టైప్‌-2 మధుమేహంపై సీబీఎస్‌ అప్రమత్తమై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించనుంది. పాఠశాలల్లో చక్కెరపై సమాచారం బోర్డులు ఏర్పాటు చేసి, ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది.

Diabetes Awareness: పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించండి

  • పాఠశాలల్లో ‘సుగర్‌ బోర్డులు’ పెట్టండి..

  • ప్రిన్సిపాళ్లకు సీబీఎస్‌ఈ ఆదేశాలు

న్యూఢిల్లీ, మే 18: మధుమేహంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని సీబీఎ్‌సఈ నిర్ణయించింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన టైప్‌-2 డయాబెటెస్‌ ఇప్పుడు పిల్లల్లోనూ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పాఠశాల స్థాయి నుంచే అప్రమత్తత పాటించేలా చర్యలు తీసుకోనుంది. విద్యార్థులు పరిమితికి మించి స్వీట్లు, చక్కెర పదార్థాలు తినకుండా, శీతల పానీయాలు తాగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పాఠశాలలకు సూచించింది. పాఠశాలల్లో సుగర్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏ తినుబండారంలో చక్కెర ఎంత శాతం ఉందో రాయాలని సూచిస్తూ అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు లేఖలు రాసింది. 4 నుంచి 10 ఏళ్లలోపు విద్యార్థులు తినే ఆహారంలో 13 శాతం చక్కెర ఉంటోంది. 11-18 ఏళ్ల పిల్లల్లో ఇది 15 శాతంగా ఉంది. అనుమతించిన పరిమితి కన్నా ఇది 5 శాతం అధికం. అందువల్ల ఏ తినుబండారంలో ఎంత చక్కెర ఉందో, అధికంగా తింటే ఎలాంటి ముప్పు ఉంటుందో బోర్డులపై రాయాలని తెలిపింది. ఈ ఆదేశాల అమలుపై జులై 15లోగా సంక్షిప్తంగా నివేదిక, ఫొటోలు పంపాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్

రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 08:56 AM