Share News

CBSE: పేపర్ల లీకేజీ వార్తలు నిరాధారం: సీబీఎస్‌ఈ

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:22 AM

ఆ ప్రచారం అంతా నిరాధారమని కొట్టిపారేసింది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 10, 12 తరగతుల పేపర్లు లీక్‌ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీబీఎ్‌సఈ సూచించింది.

CBSE: పేపర్ల లీకేజీ వార్తలు నిరాధారం: సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పరీక్షల పేపర్లు లీకయ్యాయంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై సీబీఎ్‌సఈ స్పష్టత ఇచ్చింది. ఆ ప్రచారం అంతా నిరాధారమని కొట్టిపారేసింది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 10, 12 తరగతుల పేపర్లు లీక్‌ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీబీఎ్‌సఈ సూచించింది. వదంతులకు కారకులపై చర్యలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు వెల్లడించారు. ‘‘వదంతుల ప్రచారంలో విద్యార్థుల పాత్ర ఉంటే.. తదనంతర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సీబీఎ్‌సబీ నిబంధనలు, ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని బోర్డు సీనియర్‌ అధికారి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 05:22 AM