CBSE: సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదేపై చేయి
ABN , Publish Date - May 14 , 2025 | 05:50 AM
సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో 93 శాతం, 12వ తరగతి ఫలితాల్లో 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలురకు పైచేయి సాధించి, జవహర్ నవోదయ విద్యాలయాల్లో అత్యధిక ఉత్తీర్ణత రేటు నమోదైంది.
న్యూఢిల్లీ, మే 13: సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో 93 శాతం, 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం విడుదలైన ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 12వ తరగతి పరీక్షల్లో బాలికలు 91.64 శాతం మంది, బాలురు 85.70 శాతం మంది పాస్ అయ్యారు. దేశవ్యాప్తంగా విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 99.60 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, తిరువనంతపురం రెండో స్థానంలో నిలిస్తే, ప్రయాగ్‌గాజ్ రీజియన్ పరిధిలో అతి తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 99.9 శాతం పాసైతే, ప్రైవేటు, ఇండిపెండెంట్ స్కూళ్లలో 87.94 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 16,92,794 మంది 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు డివిజన్లు ఇవ్వడం లేదన్న సీబీఎ్‌సఈ పరీక్షల నియంత్రణాధికారి సాన్యం భరద్వాజ.. అత్యధిక మార్కులు సాధించిన వారికి మెరిట్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ.. కేవలం ఒక్క పరీక్ష మాత్రమే వారి శక్తి, సామర్థ్యాలను నిర్వచించలేదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..