Share News

తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్‌ సస్పెన్షన్‌ రద్దు

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:21 AM

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్‌ అధికారి వికాస్‌ కుమార్‌పై కర్ణాటక ప్రభుత్వం వేసిన సస్పెన్షన్‌ వేటును సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేసింది.

తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్‌ సస్పెన్షన్‌ రద్దు

బెంగళూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్‌ అధికారి వికాస్‌ కుమార్‌పై కర్ణాటక ప్రభుత్వం వేసిన సస్పెన్షన్‌ వేటును సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేసింది. జూన్‌ 4న ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.


ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌తోపాటు పలువురు ఐపీఎస్‌ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే, తనను సస్పెండ్‌ చేయడంపై బెంగళూరు పశ్చిమ అదనపు పోలీస్‌ కమిషనర్‌ వికా్‌సకుమార్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌ తీర్పుపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 02 , 2025 | 06:21 AM