Share News

Kochi ship accident: కొచ్చి తీరంలో హై అలెర్ట్‌

ABN , Publish Date - May 26 , 2025 | 02:18 AM

కోచ్చి సమీపంలో లైబీరియా నౌక మునిగిపోవడంతో హైఅలెర్ట్‌ ప్రకటించబడింది. ప్రమాదకర రసాయనాలు ఉన్న కంటెయినర్లు సముద్రంలో మునిగిపోవడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Kochi ship accident: కొచ్చి తీరంలో హై అలెర్ట్‌

కంటెయినర్లతో మునిగిన లైబేరియా నౌక

కొన్నింటిలో ప్రమాదకర రసాయనాలు

కొచ్చి, న్యూఢిల్లీ, మే 25: కొచ్చికి సమీపంలో కంటెయినర్ల నౌక మునిగిపోవడంతో కోస్ట్‌గార్డ్‌, కేరళ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మునిగిన కొన్ని కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు ఉండడంతో కొచ్చి తీరంలో హైఅలెర్ట్‌ ప్రకటించాయు. ఒడ్డుకు కొట్టుకువచ్చే కంటెయినర్లనుగానీ, చమురుతెట్టునుగానీ తాకకూడదని ప్రజలను హెచ్చరించాయి. ఆఫ్రికా ఖండంలోని లైబేరియా దేశానికి చెందిన ఆ సరకు రవాణా నౌక ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నౌకలోని మొత్తం 24 మంది సిబ్బందిని ఇండియన్‌ కోస్టు గార్డు కాపాడింది. నౌకలోని మొత్తం 24 మంది సిబ్బందిలో 21 మందిని శనివారమే కోస్టు గార్డ్‌ కాపాడింది. సహాయ చర్యల నిమిత్తం మిగిలిన ముగ్గురు సీనియర్‌ సిబ్బంది నౌకపైనే ఉండిపోవాల్సి వచ్చింది. నౌక మునిగిపోక తప్పదని స్పష్టం కావడంతో భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎ్‌స సుజాత నౌక ఆదివారం వారిని కాపాడింది. 180మీటర్ల పొడవున్న ఆ నౌకలో మొత్తం 640 కంటెయినర్లు ఉన్నాయి. అవన్నీ సముద్రంలో మునిగిపోయినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 13 కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్‌ ఉన్నట్టు పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 02:18 AM