Share News

Heart Attack: ఆస్పత్రి రౌండ్స్‌లో డాక్టర్‌కు గుండెపోటు

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:12 AM

ఆసుపత్రి వార్డులో రోగులను పరీక్షిస్తూ గుండెపోటుతో ఓ యువ గుండె శస్త్రచికిత్సా నిపుణుడు కుప్పకూలాడు.

Heart Attack: ఆస్పత్రి రౌండ్స్‌లో డాక్టర్‌కు గుండెపోటు

  • యువ కార్డియాక్‌ సర్జన్‌ మృతి

  • చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన

చెన్నై, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రి వార్డులో రోగులను పరీక్షిస్తూ గుండెపోటుతో ఓ యువ గుండె శస్త్రచికిత్సా నిపుణుడు కుప్పకూలాడు. సహచర వైద్యులు, సీనియర్‌ వైద్య నిపుణులు ఆయనను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చెన్నై సవిత వైద్య కళాశాలలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డాక్టర్‌ గ్రాడ్లిన్‌ రాయ్‌(39) చురుకైన, నిపుణుడైన గుండె శస్త్రచికిత్సా వైద్యునిగా పేరుపొందారు. గత బుధవారం ఆయన యథావిధిగా వార్డులో రోగులను పరీక్షిస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు.


గమనించిన సహచరులు, సిబ్బంది ఆయనకు సీపీఆర్‌ చేశారు. ఐసీయూకు తరలించారు. అత్యాధునిక చికిత్సలను అందించారు. ఎన్ని చేసినా గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన ధమని 100ు పూడుకుపోవడంతో వచ్చిన గుండెపోటు కావడంతో జరిగిన నష్టాన్ని పూడ్చడం వైద్యులకు సాధ్యం కాలేదు. దీంతో డాక్టర్‌ రాయ్‌ మరణించినట్లు ప్రకటించారు. డాక్టర్‌ రాయ్‌కు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని సహచరులు పేర్కొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 05:12 AM