Indian Railways : దక్షిణ కోస్తా రైల్వే జోన్.. ఇక అధికారికం
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:27 AM
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్.. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు శుక్రవారం లాంఛనంగా ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కుదించిన వాల్తేరు డివిజన్ ఇకపై విశాఖ డివిజన్‌గా మార్పు
410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్‌లోకి
680 కిలోమీటర్లతో రాయగడ డివిజన్.. తూర్పుకోస్తా రైల్వేలోకి
ఐటీ బిల్లుకు ఓకే.. 8800 కోట్లతో 2026 దాకా స్కిల్ ఇండియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్.. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు శుక్రవారం లాంఛనంగా ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, దీనివల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్థి చెందుతాయని వెల్లడించారు. కొత్త జోన్ వల్ల రైల్వే ఆపరేషన్లలో సమర్థత పెరుగుతుందని చెప్పారు. కుదించిన వాల్తేరు డివిజన్‌ను ఇకపై విశాఖ డివిజన్‌గా పరిగణిస్తారని.. వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగం (410 కిలోమీటర్లు) విశాఖపట్నం డివిజన్‌గా దక్షిణ కోస్తా జోన్‌లో ఉంటుందని తెలిపారు. వాల్తేరు డివిజన్‌లోని మిగతా భాగం (680 కిలోమీటర్ల)తో కొత్తగా తూర్పు కోస్తా రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ ఏర్పడుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాన్ని ఈ నిర్ణయంతో నేరవేర్చినట్టయిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించారని అశ్వినీ వైష్ణవ్ గుర్తు చేశారు. క్యాబినెట్ ఆమోదంతో.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ఉనికిలోకి వచ్చినట్టయింది. కాగా, దీంతోపాటు మరో మూడు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఐటీ చట్టం స్థానంలో తేనున్న కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లుకు ఆమోదం. ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని సరళతరం చేసేందుకే దీన్ని రూపొందించారు. వచ్చేవారంలో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపుతారు.
2022-23 నుంచి 2025-26 వరకూ రూ.8,800 కోట్ల వ్యయంతో ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించి 2026 దాకా కొనసాగించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్. కాగా.. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటి్‌సషిప్ ప్రమోషన్ స్కీమ్(పీఎం-న్యాప్స్), జనశిక్షణ్ సంస్థాన్ స్కీమ్(జేఎ్‌సఎ్‌స)లను ‘స్కిల్ ఇండియా ప్రోగ్రాం’ పరిధిలోకి తీసుకొచ్చినట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
జాతీయ పారిశుధ్య కార్మికుల కమిషన్ కాలపరిమితిని 31.03.2025 నుంచి 31.03.2028 వరకూ పొడిగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం
Also Read: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
Also Read: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత