Gold Prices: 2030 నాటికి కిలో బంగారం విలువతో రోల్స్‌రాయిస్ కారు!
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:06 AM
పెరగడమే తప్ప తగ్గడమే తెలియదన్నట్టుగా రోజురోజుకూ బంగారం ధర పెరిగిపోతున్న నేపథ్యంలో..
2040లో ప్రైవేట్ విమానమే కొనొచ్చు
ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా
న్యూఢిల్లీ, అక్టోబరు 14: పెరగడమే తప్ప తగ్గడమే తెలియదన్నట్టుగా రోజురోజుకూ బంగారం ధర పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, సియెట్ టైర్స్ సహా 15కు పైగా సంస్థలున్న ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ‘ఎక్స్’లో ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. 1980ల నుంచి ఇప్పటిదాకా.. కిలో పసిడి ధర ఎంత ఉందో.. అప్పటికి ఆ సొమ్ముతో ఏ కారు కొనొచ్చో సరదాగా వివరించారు.
పాఠం: కిలో బంగారాన్ని దాచిపెట్టుకోండి. 2030లో దాని విలువ రోల్స్ రాయిస్ కారు, 2040లో ప్రైవేట్ జెట్ కొనొచ్చు.. అని హర్ష్ గోయెంకా తన ‘ఎక్స్’ అకౌంట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ చాలా మంది రిప్లైలు ఇవ్వగా.. ఒక వ్యక్తి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించారు. 2000 సంవత్సరంలో కేజీ బంగారం ధర రూ.4.4 లక్షలని. ఈరోజు కిలో పుత్తడి విలువ రూ.1.18 కోట్ల దాకా ఉందని గుర్తుచేశారు. అదే 2000 సంవత్సరంలో రూ.4.4 లక్షలతో సియెట్ కంపెనీ షేర్ల కొని ఉంటే వాటి విలువ ఇప్పుడు రూ.4.5 కోట్ల దాకా ఉండేదన్నారు.