Share News

BSF Tribute: బోర్డర్‌లో పోస్టుకు సిందూర్‌ పేరు

ABN , Publish Date - May 28 , 2025 | 06:36 AM

ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని గుర్తు చేస్తూ సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు 'సిందూర్‌' అని పేరు పెట్టాలని బీఎస్‌ఎఫ్‌ ప్రతిపాదించింది. మే 10న అమరులైన ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పేర్లను ఇతర రెండు పోస్టులకు పెట్టాలని కేంద్రాన్ని కోరింది.

BSF Tribute: బోర్డర్‌లో పోస్టుకు సిందూర్‌ పేరు

కేంద్ర ప్రభుత్వానికి బీఎ్‌సఎఫ్‌ ప్రతిపాదన

న్యూఢిల్లీ, మే 27: ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో.. భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు ‘సిందూర్‌’ అని పేరు పెట్టాలని బీఎ్‌సఎఫ్‌ ప్రతిపాదించింది. అలాగే మే 10న సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అమరులైన ఇద్దరు బీఎ్‌సఎఫ్‌ సిబ్బంది పేర్లను మరో రెండు పోస్టులకు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మే 10న పాకిస్థాన్‌ బీఎ్‌సఎఫ్‌ పోస్టులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ దాడులు చేయగా, బీఎ్‌సఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌, కానిస్టేబుల్‌ దీపక్‌ అమరులయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:36 AM