Emmanuel Macron: మెక్రాన్ చెంప చెళ్లుమనిపించిన భార్య
ABN , Publish Date - May 27 , 2025 | 04:56 AM
వియత్నాంలో అధ్యక్షుడు మెక్రాన్ భార్య చెంపదెబ్బ కొట్టినట్టు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అయితే అది ఆటవిడుపు చర్య మాత్రమేనని మెక్రాన్ స్పష్టీకరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ, మే 26: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఆయన భార్య చెంపమీద కొట్టారా? వియత్నాంలోని హనోయ్‌లో ఆదివారం మెక్రాన్ దంపతులు విమానంలోంచి దిగుతుండగా చిత్రీకరించిన వీడియోలోని దృశ్యాలను చూస్తే ఔను అనే అనిపిస్తోంది. విమానం ల్యాండైన కొద్దిసేపటికి.. తలుపులు తెరుచుకున్నాక మెక్రాన్, ఆయన భార్య బ్రిగట్టే కలిసి దిగేందుకు సిద్ధమయ్యారు. అంతలో బ్రిగట్టే చేయి.. మెక్రాన్ చెంపకు విసురుగా తగిలింది. దీనికి ఆయన ఎంతో ఇబ్బందికరంగా రియాక్షన్ ఇవ్వడంతో అది చెంపదెబ్బే అని రూఢీ అయింది. అయితే.. వెంటనే తేరుకున్న మెక్రాన్, ముఖంలో నవ్వు పులుముకొని కింద తన కోసం వేచి ఉన్నవారివైపు చేతిని ఊపారు. తర్వాత ఆయన కిందకు దిగుతున్న క్రమంలో భార్య చేతిలో చేయి వేసేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించింది. ఈ వీడియోపై స్పందించేందుకు మెక్రాన్ కార్యాలయం తొలుత నిరాకరించినా, తర్వాత దీన్ని ఆ దంపతుల మధ్య ‘ఆటవిడుపు చర్య’గా పేర్కొంటూ తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై మెక్రాన్ కూడా స్పందించారు. ‘‘మేం కేవలం పరాచకాలాడుకున్నాం అంతే’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News