Groom And Bride: శోభనం గదిలో వరుడు చేసిన పనికి వధువు షాక్..
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:00 PM
Groom And Bride: వధువుకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే గదిలోంచి బయటకు వచ్చింది. అత్తింటి వారిని పిలిచి విషయం చెప్పింది. వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వధువు వెనక్కు తగ్గలేదు. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
శోభనం గదిలో వధువుకు ఊహించని షాక్ ఇచ్చాడు వరుడు. శోభనం గదిలోకి ఏకంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకెళ్లాడు. అసలు విషయం తెలిసి వధువు ఫైర్ అయింది. రెండు గోడల మధ్య మొదలైన గొడవ పంచాయతీ వరకు వెళ్లింది. ఆ వరుడు శోభనం గదిలోకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఎందుకు తెచ్చాడు.. పంచాయతీలో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, రామ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ జంటకు శనివారం పెళ్లయింది.
ఆదివారం రాత్రి శోభనానికి ఏర్పాట్లు జరిగాయి. శోభనం గదిలోకి రాగానే వధువు చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పెట్టాడు వరుడు. అతడలా ఎందుకు చేశాడో ఆమెకు అర్థం కాలేదు. ‘ఎందుకిది?’ అని అడిగింది. ‘మధ్యాహ్నం నువ్వు స్ప్రహతప్పి పడిపోయావు కదా.. నేను నా మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నువ్వలా స్ప్రహ తప్పి పడిపోవటం గర్భం దాల్చటం వల్లేనని అన్నాడు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించమని చెప్పాడు’ అని వరుడు వివరణ ఇచ్చాడు.
దీంతో వధువుకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే గదిలోంచి బయటకు వచ్చింది. అత్తింటి వారిని పిలిచి విషయం చెప్పింది. వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వధువు వెనక్కు తగ్గలేదు. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెంటనే అత్తింటికి చేరుకుని గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్దది అవటంతో గ్రామస్తులు కలుగజేసుకున్నారు. గొడవ ఆపారు. తర్వాత పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీలో వరుడు తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఫ్రెండ్ ఇచ్చిన తప్పుడు సలహా కారణంగా ఇదంతా జరిగిందని, మూర్ఖంగా ప్రవర్తించానని అన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయయని అందరి ముందు ప్రమాణం చేశాడు. దీంతో వరుడు, వధువు మళ్లీ కలిసి పోయారు.
ఇవి కూడా చదవండి
హీరో ఆర్య సినిమా షూటింగ్‌లో విషాదం.. ఆర్టిస్ట్ మృతి
బెండకాయ కూర తెచ్చిన తంటా .. ఇంట్లోంచి పారిపోయిన యువకుడు..