Okra Dish: బెండకాయ కూర తెచ్చిన తంటా .. ఇంట్లోంచి పారిపోయిన యువకుడు..
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:39 AM
Okra Dish: తల్లి బెండకాయతో కర్రీ చేసింది. దీంతో యువకుడి కోపం కట్టలు తెంచుకుంది. తల్లితో గొడవపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటినుంచి పారిపోయాడు. నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.
బెండకాయ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తల్లి చేసే బెండకాయ రుచులు నచ్చక ఓ యువకుడు ఇంటినుంచి పారిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఈ మధ్యే ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరడానికి కాలేజీ ఆడ్మీషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ యువకుడికి బెండకాయ అంటే నచ్చదు. కానీ, తల్లిమాత్రం తరచుగా బెండకాయలతో వంటలు చేసేది. ఇది నచ్చని యువకుడు తల్లితో గొడవ పడేవాడు.
జులై 10వ తేదీన కూడా తల్లి బెండకాయతో కర్రీ చేసింది. దీంతో యువకుడి కోపం కట్టలు తెంచుకుంది. తల్లితో గొడవపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటినుంచి పారిపోయాడు. నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కాడు. ఇంట్లో యువకుడు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు అతడి కోసం వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ లలితా తొడాసే ఢిల్లీలోని తన మిత్రులతో మాట్లాడారు. ఆ యువకుడి ఆచూకీ కనుక్కోగలిగారు. ఇన్‌స్పెక్టర్ తన టీమ్‌తో ఢిల్లీ వెళ్లారు. యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతడ్ని నాగ్‌పూర్ తిరిగి తీసుకువచ్చారు. యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండ
ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం..
సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూత