Share News

Bombay High Court: పోస్టు పెట్టినంత మాత్రాన విద్యార్థినిని అరెస్టు చేస్తారా

ABN , Publish Date - May 28 , 2025 | 06:34 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై వచ్చిన పోస్టును ఫార్వర్డ్‌ చేసిన విద్యార్థిని అరెస్టు చేయడంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. కేవలం పోస్టు షేర్‌ చేసినందుకు జీవితాన్ని నాశనం చేయడమా అని కోర్టు ప్రశ్నించింది.

 Bombay High Court: పోస్టు పెట్టినంత మాత్రాన విద్యార్థినిని అరెస్టు చేస్తారా

ఆమె జీవితాన్ని నాశనం చేస్తారా?

మహారాష్ట్రపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ముంబయి, మే 27: ఆపరేషన్‌ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టును ఫార్వర్డ్‌ చేసిన ఓ విద్యార్థినిని అరెస్టు చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్టు పెట్టినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది. ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆక్షేపించింది. పుణెలోని సిన్హ్‌గడ్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఈ నెల ఏడో తేదీన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేసింది. విమర్శలు రావడంతో రెండు గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించింది. పోస్టు పెట్టినందుకు కళాశాలకు రావద్దంటూ యాజమాన్యం ఆమెను ఆదేశించింది. పోలీసు కేసు కూడా నమోదు కావడంతో అరెస్టు చేసి ఎరవాడ సెంట్రల్‌ జైలుకు పంపించారు. కాలేజీ నుంచి తనను పంపించివేయడంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:34 AM