AP Bhavan Bomb Threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు
ABN , Publish Date - May 03 , 2025 | 04:32 AM
ఢిల్లీలోని ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా దళాలు శుక్రవారం రాత్రి భారీ తనిఖీలు నిర్వహించాయి. ఈమెయిల్ 'ఫూలే' సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రావడం కలకలం రేపింది.
డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. భవన్‌లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్ చేశాడు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ‘ఫూలే’ జీవితకథ ఆధారంగా నిర్మించిన సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ మెయిల్ వచ్చింది. ఆ సమయంలో కమిషనర్ ముంబైలో ఉన్నారు. వెంటనే భవన్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకుపైగా తనిఖీలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..