Boat Capsizes: తీవ్ర విషాదం.. నదిలో బోల్తాపడ్డ పడవ.. 20 మంది గల్లంతు..
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:45 PM
బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భర్తాపూర్ గ్రామస్తులు ఖైరాటియా గ్రామం నుంచి ఊరికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పడవ అదుపు తప్పింది.
ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహ్‌రైచ్ జిల్లాలోని కౌడియాల నదిలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గల్లంతయ్యారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారంతా భర్తాపూర్ గ్రామానికి చెందిన వారే కావటం గమనార్హం. భర్తాపూర్ గ్రామం కౌడియాల నది తీరంలో ఉంది. గ్రామస్తులు నది మీద నుంచి పొరుగు ఊర్లకు వెళ్లడానికి పడవల్ని ఆశ్రయిస్తున్నారు.
బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భర్తాపూర్ గ్రామస్తులు ఖైరాటియా గ్రామం నుంచి ఊరికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పడవ అదుపు తప్పింది. నదిలో బోల్తా పడి మునిగిపోయింది. గ్రామస్తులతో పాటు కొంతమంది అతిథులు కూడా నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నలుగుర్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నది ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతోటే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు