Share News

Delhi elections: బీజేపీ ‘కరువు’ తీరింది!

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:51 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ విజయం అందుకుంది. అయితే ఇదే సమయంలో 1993 నుంచి గెలుపు అందని ద్రాక్షగా ఉన్న 9 నియోజకవర్గాలు, 2008 నుంచి విజయం దక్కని మూడు స్థానాలకుగానూ ఈసారి నాలుగింటిలో విజయకేతనం ఎగరవేసింది.

Delhi elections: బీజేపీ ‘కరువు’ తీరింది!

ఢిల్లీలో దశాబ్దాలుగా గెలవని 12 స్థానాల్లో ఈసారి నాలుగింట విజయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ విజయం అందుకుంది. అయితే ఇదే సమయంలో 1993 నుంచి గెలుపు అందని ద్రాక్షగా ఉన్న 9 నియోజకవర్గాలు, 2008 నుంచి విజయం దక్కని మూడు స్థానాలకుగానూ ఈసారి నాలుగింటిలో విజయకేతనం ఎగరవేసింది. ఈ పన్నెండు స్థానాల్లో 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత న్యూఢిల్లీ, వికా్‌సపురి, కొండ్లి ఏర్పాటు కాగా, మిగతా తొమ్మిది స్థానాలు మటియా మహల్‌, బల్లీమారాన్‌, అంబేద్కర్‌ నగర్‌, సీలంపూర్‌, ఓక్లా, సూల్తాన్‌పూర్‌ మర్జా, మంగోల్‌పురి, జంగ్‌పుర, దియోలి. వీటిల్లో జంగ్‌పుర, న్యూఢిల్లీ, మంగోల్‌పురి, వికా్‌సపురి నియోజకవర్గాల్లో బీజేపీ ఈసారి ఎట్టకేలకు తన జెండా పాతింది.

Updated Date - Feb 10 , 2025 | 04:51 AM