Share News

Rajya Sabha Elections: జమ్మూ కశ్మీర్‌లో రాజ్యసభ ఎన్నికల్లో

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:29 AM

జమ్మూ-కశ్మీర్‌లో నిర్వహించిన రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి.

Rajya Sabha Elections: జమ్మూ కశ్మీర్‌లో రాజ్యసభ ఎన్నికల్లో

  • బీజేపీకి 1, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 3 సీట్లు

శ్రీనగర్‌, అక్టోబరు 24: జమ్మూ-కశ్మీర్‌లో నిర్వహించిన రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా మూడింటిలో అధికారిక నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన చౌదరి మహమ్మద్‌ రమ్‌జాన్‌, సాజద్‌ కిచ్లూ, జి.ఎ్‌స.ఒబెరాయ్‌ అలియాస్‌ షమ్మీ ఒబెరాయ్‌ గెలుపొందారు. నాలుగో స్థానంలో బీజేపీకి చెందిన సత్‌ శర్మ విజయం సాధించారు. శర్మకు 32 ఓట్లు రాగా, ప్రత్యర్థి అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ యువ అధికార ప్రతినిధి ఇమ్రాన్‌ నబీ దర్‌కు 22 వచ్చాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, బీజేపీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ సాజద్‌ లోన్‌ ఆరోపించారు.

Updated Date - Oct 25 , 2025 | 04:30 AM