BJP MP Ravi Kishan: సమోసాల రేట్లలో ఎందుకిన్ని తేడాలు.. ఆహార ధరలను క్రమబద్ధీకరించాలి: ఎంపీ రవికిషన్
ABN , Publish Date - Jul 31 , 2025 | 09:33 PM
కోట్లాది మంది వినియోగదారులతో కూడిన ఇంత విశాలమైన మార్కెట్ ఎటువంటి నియయ నిబంధనలు లేకుండా పనిచేస్తోందని గోరఖ్‌పూర్ ఎంపీ అయిన రవికిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేలాంటి సమోసాలను వేర్వేరు స్థలాల్లో వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు.
తెలుగుతోపాటు పలు భాషల సినిమాలు చేసిన నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ (BJP MP Ravi Kishan) ఆహార పదార్థాల ధరలను నియంత్రించాలని (Regulate food prices) ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం అభ్యర్థించారు. కోట్లాది మంది వినియోగదారులతో కూడిన ఇంత విశాలమైన మార్కెట్ ఎటువంటి నియయ నిబంధనలు లేకుండా పనిచేస్తోందని గోరఖ్‌పూర్ ఎంపీ అయిన రవికిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమోసాలను (Samosa) వేర్వేరు స్థలాల్లో వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు.
బుధవారం లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా ఎంపీ రవికిషన్ మాట్లాడారు. ఆహార పదార్థాల ధరలు, నాణ్యత, పరిమాణం విషయంలో ఏకరూపత ఉండాలని అన్నారు. దాల్ తడ్కాను కొన్ని అవుట్‌లెట్లలో రూ.100కి, మరికొన్నింటిలో రూ.120కి, కొన్ని హోటళ్లలో రూ.1,000కి విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే సమోసాల విక్రయం గురించి మాట్లాడారు. రవికిషన్ వాదనలను కాంగ్రెస్ ఎగతాళి చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ బీజేపీ ఎంపీని ఎగతాళి చేశారు.
'ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీ నిర్వహిస్తున్న విమానాశ్రయాల్లో సమోసా ధరలను నియంత్రించాలని మీరు అడగగలరా' అని ప్రశ్నించారు. కాగా, సమోసాలు లేదా ఫుడ్‌స్టాల్స్‌లో ఆహార పదార్థాల ధరలు అనే అంశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవే అని, అలాంటి వాటిని ఎగతాళి చేయడం సముచితం కాదని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి