Share News

BJP: వచ్చే నెలలోనే బీజేపీకి కొత్త బాస్‌

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:01 AM

పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఆపరేషన్‌ సిందూర్‌తో ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహర్తం దగ్గరపడిందా ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తవగానే కొత్త అధ్యక్షుడు రానున్నారా...

BJP: వచ్చే నెలలోనే బీజేపీకి కొత్త బాస్‌

  • రేసులో ఉన్న నేతల జాబితా ఇప్పటికే సిద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఆపరేషన్‌ సిందూర్‌తో ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహర్తం దగ్గరపడిందా? ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తవగానే కొత్త అధ్యక్షుడు రానున్నారా? నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే బీజేపీ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుందా? ఈ ప్రశ్నలకు బీజేపీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరులో బిహార్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని, ఆలోగానే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారని అంటున్నాయి. వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి సంప్రదింపులు ప్రారంభం కానున్నాయని.. అధ్యక్ష పదవి రేసులో ఉన్న నాయకుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపా యి. నూతన జాతీయాధ్యక్షుడి ఎంపికలో కులం, ప్రాంతం, సామాజిక వర్గ సమీకరణాల ప్రాతిపదిక ఏమీ ఉండకపోవచ్చని.. జాతీయ స్థాయిలో నిరూపితమైన సంస్థాగత అనుభవమున్న నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఒకవేళ బిహార్‌ ఎన్నికలకు ముందే జాతీయాధ్యక్షుడి ఎన్నిక జరగకపోతే.. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకే ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 03:01 AM