Share News

Delhi Politics: ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:26 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.

Delhi Politics: ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

న్యూఢిల్లీ, జనవరి 4: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మను బరిలోకి దించింది. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నుంచి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ పోటీపడుతున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఢిల్లీ సీఎం అతీశీపై కల్కాజీలో మాజీ ఎంపీ రమేశ్‌ బిధూరీని బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ విడుదల చేసిన 29 మంది జాబితాలో 8 మంది కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల నుంచి వచ్చిన సీనియర్‌ నేతలు ఉన్నారు. బీజేపీలో చేరిన ఆప్‌ మంత్రులు కైలాశ్‌ గెహ్లోత్‌, రాజ్‌కుమార్‌ ఆనంద్‌లకు టికెట్లు లభించాయి. ఆప్‌ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్‌ 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 02:26 AM