Share News

CP Radhakrishnan: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

ABN , Publish Date - Aug 17 , 2025 | 08:14 PM

జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగాల్సి ఉండగా, ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

CP Radhakrishnan: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
CP Radhakrishnan

న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) ప్రకటించింది. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగాల్సి ఉండగా, ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.


సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు. జార్ఖండ్‌, తెలంగాణ గవర్నర్‌గా కూడా సేవలందించారు. 1957 మే 4న రాధాకృష్ణన్ జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి విశేష కృషి చేశారు.


పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారంనాడు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. సమావేశానంతరం సీపీ రాధాకృష్ణన్ నామినేషన్‌ను జేపీ నడ్డా ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థికి విపక్షాలు సైతం తమ మద్దతు తెలుపుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 08:45 PM