Share News

Delhi Blast: ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్

ABN , Publish Date - Nov 18 , 2025 | 03:50 PM

వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ప్రమేయమున్న నలుగురు డాక్టర్లు ముజామిల్ షకీల్, ఉమర్ ఉన్ నబి, సహీనా సయీద్, అదీల్ హమ్ రాడార్‌లు వంట పేరుతో బాంబులు, దాడుల గురించి సంభాషించుకున్నారు.

Delhi Blast: ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్
Faridabad terror module

న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో పేలుడు కేసుకు సంబంధించిన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో కీలక సమాచారం వెలుగుచూసింది. ఈ వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో 'బిర్యానీ' (Biryani), 'దావత్'(Dawat) అనే సంకేత పదాలు (Codewords) వాడినట్టు బయటపడింది. ఇందులో ప్రమేయమున్న టెర్రరిస్టు డాక్టర్లందరూ ఆహారం, పానీయాలనే కోడ్‌వర్డులుగా ఎంచుకుని 'ఎన్‌క్రిప్టెడ్ యాప్‌'లో కమ్యూనికేషన్ సాగించారు. పేలుళ్లకు 'బిర్యానీ' అనే కోడ్‌వర్డ్, దాడి చేసే రోజుకు 'దావత్' అనే కోడ్‌వర్డ్ వాడారు.


బిర్యానీ సిద్ధమైందంటే..

డాక్టర్ల చాట్‌లో 'బిర్యానీ సిద్ధం.. విందుకు సిద్ధంకండి' అనే మెసేజ్ ఉంటే దానికి.. బాంబు రెడీగా ఉందని, దాడి అనివార్యమని అర్ధమని సెక్యూరిటీ ఏజెన్సీలు తెలిపాయి. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ప్రమేయమున్న నలుగురు డాక్టర్లు ముజామిల్ షకీల్, ఉమర్ ఉన్ నబి, సహీనా సయీద్, అదీల్ హమ్ రాడార్‌లు వంట పేరుతో బాంబులు, దాడుల గురించి సంభాషించుకున్నారు.


కొనసాగుతున్న దాడులు

కాగా, ఎర్రకోట ప్రాంతంలోని కారు పేలుడు వివాదంలో చిక్కుకున్న ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన ట్రస్టీలు, ప్రమోటర్ల నివాసాలపై ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఏకకాలంలో దాడులు జరిపింది. అల్‌ ఫయిదీ ట్రస్టు, యూనివర్శిటీ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు సంబంధించిన 25 ప్రాంతాల్లో ఈడీ టీమ్‌లు తెల్లవారుజామున 5.15 గంటలకు దాడులు మొదలుపెట్టాయి. ఢిల్లీ ఓఖ్లా ఏరియాలోని కార్యాలయంపై దాడులు జరిపిన ఈడీ టీమ్‌కు పోలీసులు, పారామిలటరీ బలగాలు సెక్యూరిటీ కల్పించాయి.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్‌కు సాయం చేసింది ఇతడే..

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. పేలుడుకు ముందు వీడియో రికార్డ్ చేసిన ఉమర్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 18 , 2025 | 04:27 PM