Share News

Passport Rules: 2023 అక్టోబరు 1 తర్వాత పుడితే పాస్‌పోర్టు జారీకి బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

ABN , Publish Date - Mar 02 , 2025 | 05:30 AM

జనన మరణాల ధ్రువీకరణ రిజిస్ట్రార్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ లేదా 1969 జనన మరణాల చట్టం ప్రకారం సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించొచ్చని పేర్కొంది.

Passport Rules: 2023 అక్టోబరు 1 తర్వాత పుడితే పాస్‌పోర్టు  జారీకి బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

న్యూఢిల్లీ, మార్చి 1: పాస్‌పోర్టు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. 2023 అక్టోబరు 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి ఇకపై జనన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జనన మరణాల ధ్రువీకరణ రిజిస్ట్రార్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ లేదా 1969 జనన మరణాల చట్టం ప్రకారం సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించొచ్చని పేర్కొంది. అలాగే 2023 అక్టోబరు 1కి ముందు జన్మించిన వారు జనన తేదీకి రుజువుగా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాఠశాల ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ) లేదా సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 05:30 AM