Share News

Bilawal Bhutto: దేశానికి తలవంపులు.. పాక్ నేత బిలావల్ భుట్టోపై ఉగ్రవాది తనయుడి ఆగ్రహం

ABN , Publish Date - Jul 06 , 2025 | 09:58 PM

ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించేందుకు సిద్ధమేనన్న పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టోపై ఉగ్రవాది తల్హా సయీద్ మండిపడ్డాడు. భుట్టో ప్రకటన పాక్‌కు తలవంపులు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Bilawal Bhutto: దేశానికి తలవంపులు.. పాక్ నేత బిలావల్ భుట్టోపై ఉగ్రవాది తనయుడి ఆగ్రహం
Bilawal Bhutto Hafiz Saeed

ఇంటర్నెట్ డెస్క్: భారత్ కోరిన ఉగ్రవాదులను అప్పగించేందుకు అభ్యంతరం లేదంటూ పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ఇటీవల చేసిన ప్రకటనపై పాక్ ఉగ్రవాదులు మండిపడుతున్నారు. ఈ విషయమై మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తనయుడు తల్హా సయీద్ మాట్లాడుతూ బిలావల్ పాక్‌కు తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిలావల్ ఇలాంటి కామెంట్ చేసి ఉండాల్సింది కాదని తల్హా సయీద్ అభిప్రాయపడ్డాడు. హఫీజ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సిద్ధమేనని అనడం పాక్‌కు తలవంపులు తెచ్చిందని వ్యాఖ్యానించాడు. ఈ ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశాడు. తల్హా సయీద్‌పై కూడా గ్లోబల్ టెర్రరిస్టు ముద్ర ఉంది.


అల్ జజీరా ఛానల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ భారత్, పాక్‌ల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై స్పందించారు. భారత్ కోరిన వారిని అప్పగించేందుకు సిద్ధమేనని, ఇందుకు భారత్‌కు కూడా సహకరించాలని కోరారు. ఎల్‌ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను కూడా అప్పగిస్తారా అన్న ప్రశ్నకు భుట్టో ఈ మేరకు సమాధానమిచ్చారు. భారత్, పాక్ మధ్య జరిగే సమగ్ర చర్చల్లో ఉగ్రవాదం కూడా ఒక అంశమేనని అన్నారు. ఈ విషయంలో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని అన్నారు.


ఎల్‌ఈటీతో పాటు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను పాక్ నిషేధించిన విషయం తెలిసిందే. ముంబై 26/11 దాడుల సూత్రధారి అయిన హఫీజ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అతడికి 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక 2001 నాటి పార్లమెంటుపై దాడి మొదలు భారత్‌లో జరిగిన అనేక ఉగ్ర ఘటనల వెనకాల మసూద్ అజర్ పాత్ర ఉంది. అయితే, ఈ ఇద్దరు పాక్‌లో పూర్తి స్వేచ్ఛతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తు్న్నారని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఎల్‌ఈటీ చీఫ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పిన భుట్టో మసూద్ అజర్ మాత్రం అఫ్గానిస్థాన్‌లో ఉండి ఉండొచ్చని అన్నారు.

ఇవీ చదవండి:

జపాన్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం.. ఆ జోస్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు

జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 10:13 PM