Share News

Bihar Elections: బిహార్‌లో సీట్ల సర్దుబాట్లు: బీజేపీకి చిరాగ్ పాశ్వాన్ సూక్తి ముక్తావళి

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:20 PM

బిహార్ ఎన్‌డీఏ (NDA)కూటమిలో సీట్ల సర్దుబాటు పెద్ద టాస్క్‌లా మారుతోంది. తాజాగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్య చేశారు. తన తండ్రి, లోక్‌జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారని..

Bihar Elections: బిహార్‌లో సీట్ల సర్దుబాట్లు: బీజేపీకి చిరాగ్ పాశ్వాన్ సూక్తి ముక్తావళి
Bihar elections 2025, NDA seat sharing

పాట్నా, అక్టోబర్ 8 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్‌డీఏ (NDA)కూటమిలో సీట్ల సర్దుబాటు పెద్ద టాస్క్ లా మారుతోంది. సీట్ల పంపకాలపై ఆయా పార్టీల మధ్య ఉద్విగ్నభరిత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. తన తండ్రి, లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ వర్థంతి(అక్టోబర్ 8) రోజున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్య ఎన్‌డీఏలోని భాగస్వాముల మధ్య కొత్త చర్చకు దారితీస్తోంది.


చిరాగ్ పాశ్వాన్ సదరు పోస్ట్‌లో.. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాటల్ని ఉటంకించారు. 'పాపా ఎల్లప్పుడూ చెప్పేవారు, పాపం చేయకు, పాపం భరించకు. జీవించాలనుకుంటే, మరణించడం నేర్చుకో, ప్రతి అడుగులో పోరాటం చేయడం నేర్చుకో' అని రాశారు. దీనిపై బిహార్ లో రాజకీయ నేతలు తమ ఇష్టానికి నిర్వచిస్తున్నారు.

కాగా, ఇటీవల పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో చిరాగ్ ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలపై నేరుగా మాట్లాడారు, 'సీట్ల షేరింగ్ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సమాచారం తెలియజేస్తాం' అని చెప్పారు.

ఇలా ఉండగా, బిహార్‌ ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ-ఆర్‌వీ, హిందుస్తానీ అవామ్ మోర్చా వంటి మిత్ర పక్షాలు సభ్యులు గా ఉన్నాయి. వీటి మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపిణీపై ఇంకా ఒప్పందం కుదుర్చుకోలేదు.


ఇలాఉంటే, బీజేపీ, జేడీయూ రెండు పార్టీలు 103 సీట్లకు డిమాండ్ చేస్తున్నాయి. హామ్ పార్టీ 15-18 సీట్లు కోరుతోంది.. కానీ బీజేపీ 7 నుంచి 8 మాత్రమే ఇవ్వాలనుకుంటోంది. చిరాగ్ పార్టీ 40-50 సీట్లు డిమాండ్ చేస్తోంది.. కానీ బీజేపీ 20 సీట్లు మాత్రమే ప్రతిపాదించింది.

ముఖ్యంగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 5 లోక్‌సభ స్థానాల్లో ప్రతి ఒక్కటికి రెండు అసెంబ్లీ సీట్లను చిరాగ్ కోరుతున్నట్టు తెలుస్తోంది. సీట్ల పంపకాలకి సంబంధించి ఈ రోజు సాయంత్రం పాట్నాలో ఎన్‌డీఏ టాప్ నాయకుల మీటింగ్ జరగనుంది. కాగా, బిజేపీ బిహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం చిరాగ్‌తో చర్చలు జరిపారు.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 12:50 PM