Alternative ID proofs: ఓటు వేసేందుకు 13 ప్రత్యామ్నాయ ఐడీ కార్డులు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:54 AM
ఈపీఐసీ లేకున్నా 13 ప్రత్యామ్నాయ ఐడీలలో ఏదోక దానితో ఓటు వేయవచ్చని బిహార్ ఓటర్లకు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల రోల్‌లో పేరు ఉండటమే ముఖ్యమని, ఈసీఐ అధికారులు..
Bihar Elections: ఈపీఐసీ లేకున్నా 13 ప్రత్యామ్నాయ ఐడీలతో ఓటు వేయవచ్చని ఓటర్లకు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రకటన చేసింది.ఈపీఐసీ (ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) లేకపోతే, వోటర్లు 13 ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని పేర్కొంది.ఎన్నికల రోల్‌లో పేరు ఉండటమే ముఖ్యమని, ఈసీఐ అధికారులు స్పష్టం చేశారు.
13 ప్రత్యామ్నాయ ఐడీలు:
ఆధార్ కార్డ్
MNREGA జాబ్ కార్డ్
బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్ (ఫోటోతో)
లేబర్ మినిస్ట్రీ హెల్త్ ఇన్షూరెన్స్ స్మార్ట్ కార్డ్
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
PAN కార్డ్
NPRలో RGI స్మార్ట్ కార్డ్
ఇండియన్ పాస్‌పోర్ట్
పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)
సెంట్రల్/స్టేట్ గవర్నమెంట్/PSUs/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ (ఫోటోతో)
MPs/MLAs/MLCsకు జారీ చేసిన అధికారిక ఐడెంటిటీ కార్డ్
UDID కార్డ్ (సోషల్ జస్టిస్ మినిస్ట్రీ)
243 సీట్లకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 7.42 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి 65 లక్షల మందిని తొలగించారు. మరిన్ని వివరాలకు eci.gov.in చూడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News