Share News

Bengaluru Police Suspend: లంచావతారులపై వేటు

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:19 AM

కుమార్తెను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తండ్రి నుంచి లంచం డిమాండ్‌ చేసి, వేధించిన ఉద్యోగులపై చర్యలు కొనసాగుతున్నాయి. ముంబైకి చెందిన....

Bengaluru Police Suspend: లంచావతారులపై వేటు

  • తండ్రి ఆవేదన’పై స్పందించిన బెంగళూరు సీపీ

  • ఇప్పటికే ఓ ఎస్సె, కానిస్టేబుల్‌పై చర్యలు

  • తాజాగా బెళ్లందూరు ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

బెంగళూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): కుమార్తెను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తండ్రి నుంచి లంచం డిమాండ్‌ చేసి, వేధించిన ఉద్యోగులపై చర్యలు కొనసాగుతున్నాయి. ముంబైకి చెందిన అక్షయ(34) అనే యువతి సెప్టెంబరు 18న అనారోగ్యంతో బెంగళూరులో మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని ఇచ్చే క్రమంలో తన నుంచి లంచం డిమాండ్‌ చేసి వేధించారని ఆమె తండ్రి, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్స్‌ అధికారి శివకుమార్‌ తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం విదితమే. పోలీసులు, బెంగళూరు పాలికె, ఆస్పత్రి పోస్టుమార్టం ఉద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరూ వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌ సింగ్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌, కానిస్టేబుల్‌ గోరక్‌నాథ్‌ సస్పెండ్‌ అయ్యారు. లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో బెళ్లందూరు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ రొట్టిని బుధవారం సస్పెండ్‌ చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 04:20 AM