Share News

e-Shram portal: ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోండి

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:20 AM

ఆర్థిక వ్యవస్థకు గిగ్‌ వర్కర్లు అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది.

e-Shram portal: ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోండి

గిగ్‌ వర్కర్లకు కేంద్రం సూచన.. ప్రభుత్వ పథకాల వర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 8: తగిన గుర్తింపు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం కోసం ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని శనివారం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ అందరు గిగ్‌/ప్లాట్‌ఫారం వర్కర్లను కోరింది. ఆర్థిక వ్యవస్థకు గిగ్‌ వర్కర్లు అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసి, వారి పేర్లను నమోదు చేయనున్నట్టు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద ఆరోగ్య సేవలు అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆరోగ్య పథకం కింద గిగ్‌ వర్క్‌ర్లు, వారి కుటుంబ సభ్యులు ఏటా రూ.5 లక్షల మేర ఆరోగ్య సేవలు పొందడానికి వీలు కలుగుతుంది


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 02:20 AM