Share News

Snake: కుమారుడిని కాటేసిన పామును అడవిలో వదిలిన కుటుంబం

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:21 PM

కన్నకొడుకును కాటేసిన పామును చంపకుండా.. దానిని పట్టుకొని అడవిలో వదిలేసిన విషయం కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి,

Snake: కుమారుడిని కాటేసిన పామును అడవిలో వదిలిన కుటుంబం

బెంగళూరు: సాధారణంగా పామును చూస్తే భయపడి మళ్లీ ఇదే ప్రాంతానికి వస్తుందనే కారణంతో చంపేస్తుంటారు. బెళగావి(Belagavi) జిల్లాలో కన్నకుమారుడిని కాటేసి చంపిన పామును పట్టించి అడవిలో వదిలిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెళగావి జిల్లా తెలసంగ సమీపంలోని కాకమరి గ్రామం పూరిపాకలాంటి ఇంట్లో మే నెల 31న అమిత్‌ గురులింగ సింధూర(10) ఇంట్లో మొబైల్‌ చూసుకుంటూ నిద్రించాడు. ఇంట్లోకి వచ్చిన పాము బాలుడి చేతికి కాటేసింది.


pandu2.jpg

వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సలు ఫలించక అమిత్‌ మృతి చెందాడు. పాము ఇంట్లోనే ఉండిపోయింది. బాలుడి అంత్యక్రియలు జరిపిన తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి పట్టుకున్నారు. చంపేయకుండా అడవిలో వదిలివేయాలని సూచించారు. బాలుడిని కాటేసిన పామును సాధారణంగా ఎవరైనా అయితే ప్రతీకారంతో చంపేసేవారు. కానీ అడవిలో వదిలిపెట్టించడం సర్వత్రా ప్రశంసలకు కారణమైంది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 01:21 PM