Congress Candidate Naveen Yadav: జూబ్లీహిల్స్‌లో కాంగ్రె్‌సకే బీసీల సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:07 AM
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉన్నత విద్యావంతుడు బహుజన బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి....
నవీన్ సామాజిక కార్యకర్త.. బీఆర్‌ఎస్ నేతలే అసలైన రౌడీలు
కేసీఆర్ తన ఆరోపణలు విరమించుకోవాలి: జాజుల
బర్కత్‌పుర/ హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉన్నత విద్యావంతుడు - బహుజన బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. నవీన్ యాదవ్ సామాజిక కార్యకర్త అని.. కానీ ఆయనపై రౌడీ షీటర్ అని ముద్ర వేసి అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. నవీన్ యాదవ్ ఏం నేరాలు చేశారో, ఏ పోలీ్‌సస్టేషన్‌లో రౌడీ షీట్ ఉందో కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. హైదరాబాద్‌లో యాదవులకు మంచి పేరుందన్న జాజుల.. బీసీలను మోసగించడంతో బీఆర్‌ఎస్ పార్టీకి సాటి లేదన్నారు. బీసీలంటే కేసీఆర్‌కు లెక్కలేదని చెప్పారు. పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జాజుల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పెంచి పోషించిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలే అసలైన రౌడీలు, దోపిడీ దారులు, భూ కబ్జాదారులని ఆరోపించారు. ఓటు అనే ఆయుధంతో ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించి రాజకీయంగా బొంద పెట్టడానికి బీసీ సమాజమంతా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆ 2 పార్టీలను బీసీలంతా ఏకమైన చిత్తుగా ఓడించాలని జాజుల పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాకారం కావాలని కోరుతూ నవంబర్ ఒకటో తేదీన లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కోరారు.