Bank Strike : మార్చి 24 నుంచి సమ్మెకు బ్యాంకు యూనియన్ల పిలుపు
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:41 AM
మార్చి 24 నుంచి రెండు రోజులపాటు దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు యూనియన్లు పిలుపు ఇచ్చాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని కేడర్లలో తగినంత మంది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : మార్చి 24 నుంచి రెండు రోజులపాటు దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు యూనియన్లు పిలుపు ఇచ్చాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని కేడర్లలో తగినంత మంది ఉద్యోగుల నియామకం తదితర డిమాండ్ల సాధనకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 9 బ్యాంకు యూనియన్ల ఫోరమ్.. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎ్‌ఫబీయూ) ఈమేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగుల పనితీరు మదింపు, అలాగే పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్థిక సేవల శాఖ ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని యూఎ్‌ఫబీయూ డిమాండ్ చేసింది. ఈ ఆదేశాలు ఉద్యోగ భద్రతకు చేటు అని, ఉద్యోగుల మధ్య విభేదాలకు దారితీస్తాయని పేర్కొంది.