Share News

Parliament Session: సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:44 PM

త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. భారత సైన్యం పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిందని, ఊహకు కూాడా అందని విధంగా టెర్రరిస్టులను శిక్షించామని తెలిపారు.

Parliament Session: సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం
PM Modi

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని, ఈ విజయానికి సంకేతంగా పార్లమెంటులో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తనపై నమ్మకం ఉంచారని, సిందూర్ శపథాన్ని నెరవేర్చామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై లోక్‌సభలో రెండోరోజైన మంగళవారం నాడు జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత సేనల శౌర్య, ప్రతాపాలు, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినందుకు, ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు పార్లమెంటులో ఈ వియోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పారు.


త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామని మోదీ తెలిపారు. భారత సైన్యం పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిందని, ఊహలకు కూడా అందని విధంగా టెర్రరిస్టులను శిక్షించామని, ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని అన్నారు. ఏప్రిల్ 22న కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకే పహల్గాం దాడి జరిగిందని చెప్పారు.


సిందూర్ ఆపమని ఏ నేతా చెప్పలేదు

ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేతా తనకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. మే 9న పెద్దఎత్తున దాడి జరగబోతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేశారని.. దీనికి పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జేడీ వాన్స్‌కు తెలిపినట్లు మెదీ చెప్పారు. బుల్లెట్‌కు సమాధానం బుల్లెట్‌తోనే చెబుతామని.. పాకిస్థాన్‌కు ఎవరూ సాయం చేసినా ఊరుకునేది లేదని చెప్పారు. పాకిస్థాన్ ఎలాంటి కుయుక్తులు పన్నినా మళ్లీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని లోక్‌సభలో మోదీ తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్ సిందూర్‌కు విపక్షాలు సంపూర్ణంగా సహకరించినందుకు గర్విస్తున్నా

కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Jul 29 , 2025 | 08:01 PM