Share News

Delhi politics: ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా అతిశీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:18 AM

ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా.. అతిశీ పేరును ప్రతిపాదించగా, మిగిలిన వారంతా మద్దతు తెలిపారు. ఢిల్లీ ప్రతిపక్ష నేత ఒక మహిళ ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.

Delhi politics: ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా అతిశీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిశీ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఆప్‌ శాసనసభాపక్ష భేటీలో పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా.. అతిశీ పేరును ప్రతిపాదించగా, మిగిలిన వారంతా మద్దతు తెలిపారు. ఢిల్లీ ప్రతిపక్ష నేత ఒక మహిళ ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. తనను నమ్మి, తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు, పార్టీ ఎమ్మెల్యేలకుఅతిశీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, మూడు రోజుల పాటు జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 48 స్థానాలు గెలుపొంది బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:18 AM