Share News

Madhya Pradesh: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:36 AM

ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా పేరొందిన వత్సల మరణించింది. వందేళ్లకు పైబడిన ఈ ఏనుగు వృద్ధాప్యం కారణంగా మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌లో మంగళవారం చనిపోయింది.

Madhya Pradesh: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత

భోపాల్‌, జూలై 9: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా పేరొందిన వత్సల మరణించింది. వందేళ్లకు పైబడిన ఈ ఏనుగు వృద్ధాప్యం కారణంగా మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌లో మంగళవారం చనిపోయింది. టైగర్‌ రిజర్వ్‌ అధికారులు, సిబ్బంది దాని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. వత్సలను కేరళలోని నిలంబూర్‌ అడవుల నుంచి తీసుకొచ్చారు.


మొదట దానిని నర్మదాపురానికి, ఆపై పన్నా టైగర్‌ రిజర్వ్‌కు తరలించారు. అప్పటి నుంచి వత్సల ఈ రిజర్వ్‌లోనే ఉంటూ.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వత్సల రిజర్వ్‌లోని ఏనుగుల సమూహానికి నాయకత్వం వహించేదని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 05:37 AM