Share News

AR Rahman: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక గీతం.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రా‌పై ప్రశంసలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 06:42 PM

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ జూన్ 30న కర్నాటకలోని ముద్దెనహళ్లి సమీపంలో ఉన్న సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ మిషన్‌లో భాగమయ్యారు. సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.

AR Rahman: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక గీతం.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రా‌పై ప్రశంసలు
One World One Family Mission A.R.Rahman

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ, సేవే లక్ష్యంగా సాగుతున్న వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్‌లో ఆస్కార్, గ్రామీ అవార్డు విజేత... ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భాగమయ్యారు. జూన్ 30న కర్నాటకలోని ముద్దెనహళ్లి సమీపంలో ఉన్న సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన ఆయన వన్ వరల్డ్-వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ మధుసూదన్ సాయితో సమావేశమయ్యారు. అనంతరం శ్రీ సత్యసాయి లోక సేవా గురుకులం విద్యార్థులు నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శనను సద్గురుతో కలిసి వీక్షించారు.

4.jpg


శ్రీ మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో 2014లో సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ఏర్పాటయ్యింది. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నిర్వహిస్తున్న అతిపెద్ద సింఫనీగా పేరుగాంచింది.

ఏఆర్ రెహమాన్ సమక్షంలో సుమారు గంటన్నర సేపు సాగిన సింఫనీనీ అందరూ ఆద్యంతం ఆస్వాదించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు నిర్వహించిన ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.

1.jpg


భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ సింఫనీగా ఎదిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని రెహమాన్ అన్నారు. అంతే కాదు, వన్ వరల్డ్... వన్ ఫ్యామిలీ మిషన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని అందించారు. అలాగే శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు మరింత స్వాంతన కల్గించేందుకు ప్రత్యేకంగా హీలింగ్ మ్యూజిక్‌ను అందించేందుకు ముందుకొచ్చారు. ప్రపంచ మానవాళికి సేవలందిస్తున్న వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్‌కు తానిస్తున్న చిరు కానుక అని ఏఆర్ రెహమాన్ ప్రకటించారు.

3.jpg5.jpg6.jpg7.jpg8.jpg9.jpg

ఇవి కూడా చదవండి:

ఎయిర్‌ ఇండియా, బోయింగ్‌లపై న్యాయపోరాటం.. విమాన ప్రమాద బాధితుల నిర్ణయం

టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానంలో కలకలం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 01 , 2025 | 06:57 PM