Toll charges : 3 వేలకు ఏడాది టోల్ పాస్!
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:33 AM
ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే కారు యజమానులకు టోల్ బాదుడు తగ్గనుంది. ఇలాంటి వారి కోసం ఏడాది పాటు చెల్లుబాటయ్యే ‘టోల్ పాస్’ను అందుబాటులోకి తీసుకురానుంది.
కారు యజమానులకు కేంద్రం ఆఫర్!!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే కారు యజమానులకు టోల్ బాదుడు తగ్గనుంది. ఇలాంటి వారి కోసం ఏడాది పాటు చెల్లుబాటయ్యే ‘టోల్ పాస్’ను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.3000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల మీదుగా ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. రూ.30 వేలు చెల్లిస్తే 15 ఏళ్ల పాటు హైవేలపై అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ ప్రతిపాదన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద తుది పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేటు కారు యజమానుల నుంచి ప్రస్తుతం కిలోమీటరుకు వసూలు చేసే ప్రాథమిక టోల్ ధరను తగ్గించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై స్థానికులు లేదా రోజూ ప్రయాణించే వాహనదారులకు ఒక్క టోల్ ప్లాజాకు మాత్రమే నెలవారీ పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ పాస్‌ల కోసం వాహనదారులు నెలకు రూ.340 చెల్లించాలి. అంటే ఏడాదికి రూ.4080 ఖర్చవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..