Robots: అమెజాన్‌లో రోబోలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:12 AM
ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. రోబోల ద్వారా ఆ స్థానాలను భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది.
ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళికలు?
6లక్షల మంది ఉద్యోగుల స్థానంలో నియామకం!
న్యూఢిల్లీ, అక్టోబరు 22: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. రోబోల ద్వారా ఆ స్థానాలను భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది. 2033 నాటికి 6లక్షల మంది దాకా ఉద్యోగులను తగ్గించుకొని.. రోబోలతో ఆ పనులు చేయించే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించి అమెజాన్‌కు చెందిన కీలక సమాచారంతో కూడిన పత్రాలు లీకైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇప్పటికే వేర్‌హౌ్‌సలలో భారీగా రోబోలను వినియోగిస్తున్న అమెజాన్.. రానున్న రోజుల్లో వాటిని మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపింది. 75 శాతం పనులను ఆటోమేషన్ చేసేందుకు రోబోటిక్స్ బృందం పనిచేస్తోందని పేర్కొంది. అయితే దీనిపై అమెజాన్ సూటిగా స్పందించలేదు. లీకైన పత్రాలు పూర్తిగా సంస్థ ప్రణాళికను వెల్లడించేవి కావని అమెజాన్ అధికార ప్రతినిధి కెల్లీ నాంటెల్ అన్నారు. సంస్థలోని ఒక బృందం అభిప్రాయాలనే తెలియజేస్తాయని పేర్కొన్నారు. రానున్న హాలిడే సీజన్‌లో 2.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికను వెల్లడించినట్లు తెలిపారు.