Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో 3 వేల మంది అగ్నివీరులు
ABN , Publish Date - May 23 , 2025 | 05:06 AM
ఆపరేషన్ సిందూర్ విజయానికి అగ్నిపథ్ ద్వారా చేరిన అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. వాళ్లు పాక్ దాడులను అడ్డుకుని, మన సైనిక స్థావరాలను రక్షించడంలో ప్రతిభ కనబర్చారు.
న్యూఢిల్లీ, మే 22: ఆపరేషన్ సిందూర్‌లో మన సైన్యంలోని అగ్ని వీరులూ కీలకపాత్ర పోషించారు. భారత్ దాడులకు ప్రతిదాడుల కోసం దాయాది పాక్ ప్రణాళికలను చిత్తు చేయడంలో 3వేల మందికిపైగా అగ్నివీరులు గట్టి పోరాట పటిమ కనబర్చారు. కీలకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల వద్ద సైనికులతో పాటు విధుల్లో పాల్గొన్నారు. తద్వారా పాక్ క్షిపణులు, డ్రోన్ దాడుల నుంచి మనదేశ సైనిక స్థావరాలను పరిరక్షించారు. అంతా 20 ఏళ్ల వయసువారైన ఈ అగ్నివీరులు గత రెండేళ్లలో అగ్నిపథ్ పథకం కింద సైన్యంలోకి వచ్చారు. ఆపరేషన్ సిందూర్ సక్సె్‌సలో అగ్నివీరుల సహకారం ప్రశంసనీయమైనదని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News