Share News

Adani Group: 20 బడుల నిర్మాణానికి 2వేల కోట్లు

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:16 AM

ఇటీవల గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు జీత్‌ వివాహం సందర్భంగా అదానీ రూ.10వేల కోట్ల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.6వేల కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి మరో రూ.2వేల కోట్లను ఇప్పటికే ప్రకటించింది.

Adani Group: 20 బడుల నిర్మాణానికి 2వేల కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా 20 పాఠశాలలను నిర్మించేందుకు రూ.2వేల కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు అదానీ గ్రూప్‌ సోమవారం ప్రకటించింది. ఇటీవల గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు జీత్‌ వివాహం సందర్భంగా అదానీ రూ.10వేల కోట్ల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.6వేల కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి మరో రూ.2వేల కోట్లను ఇప్పటికే ప్రకటించింది. తాజాగా పాఠశాలల ఏర్పాటుకు విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్‌ దాతృత్వ విభాగమైన అదానీ ఫౌండేషన్‌.. ప్రైవేటు కే-12 విద్యలో ప్రపంచ అగ్రగామి అయిన జెమ్స్‌ ఎడ్యుకేషన్‌తో చేతులు కలిపింది. ఈ సంస్థ పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. 2025-26లో మొదటి ‘అదానీ జెమ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ లఖ్‌నవూలో అందుబాటులోకి రానుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 05:16 AM