Share News

Evacuated from Israel: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి ఆరుగురు తెలంగాణ వాసులు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:53 AM

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆయా దేశాల నుంచి ఆరుగురు తెలంగాణ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వారికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో...

Evacuated from Israel: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి ఆరుగురు  తెలంగాణ వాసులు

  • ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆశ్రయం

న్యూఢిల్లీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆయా దేశాల నుంచి ఆరుగురు తెలంగాణ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వారికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆశ్రయం కల్పించినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరుగురు తెలంగాణ విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారని, వీరిలో నలుగురు ఇరాన్‌ నుంచి, ఇద్దరు ఇజ్రాయెల్‌ నుంచి సురక్షితంగా వచ్చారని, సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారని తెలిపారు. తెలంగాణకు చెందిన మరో ఏడుగురు ఇజ్రాయెల్‌ నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్నారని, వారిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 04:56 AM