Medical Oxygen: 500 కోట్ల మందికి మెడికల్ ఆక్సిజన్ దూరం
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:57 AM
తక్కు, మధ్య ఆదాయ దేశాల్లో ఈ అసమానతలు అత్యధికంగా ఉన్నాయని న్యూ లాన్సెట్ కమిషన్ నివేదిక పేర్కొంది. ఆరోగ్య రంగంలో రోగుల చికిత్సకు మెడికల్ ఆక్సిజన్ అత్యవసరం.

ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందికి మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో లేదు. అంటే సుమారుగా 500 కోట్ల మంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ దొరకని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. తక్కు, మధ్య ఆదాయ దేశాల్లో ఈ అసమానతలు అత్యధికంగా ఉన్నాయని న్యూ లాన్సెట్ కమిషన్ నివేదిక పేర్కొంది. ఆరోగ్య రంగంలో రోగుల చికిత్సకు మెడికల్ ఆక్సిజన్ అత్యవసరం. సర్జరీ, ఆస్థమా, ట్రామా, చైల్డ్ కేర్ తదితర విభాగాలకు ఇది అత్యంత కీలకం. కొవిడ్ 19 వంటి మహమ్మారిని తట్టుకోవాలంటే మెడికల్ ఆక్సిజన్ నిల్వలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మిషన్ ఒక నివేదికను తయారు చేసింది. ప్రపంచంలో మెడికల్ ఆక్సిజన్ పంపిణీలో చోటుచేసుకున్న అసమానతలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రథమ నివేదిక ఇది.