Share News

Indian Navy : నేవీలో 270 ఉద్యోగాలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:15 AM

కేరళ ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎన్‌సీసీ) కోర్సులో 270 ఖాళీలకు అవివాహిత యువతీ, యువకుల నుంచి భారత నౌకాదళం

Indian Navy : నేవీలో 270 ఉద్యోగాలు

కేరళ ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎన్‌సీసీ) కోర్సులో 270 ఖాళీలకు అవివాహిత యువతీ, యువకుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఎగ్జిక్యూటీవ్‌ బ్రాంచ్‌(హైడ్రో కేడర్‌) పోస్టులు 60, పైలెట్‌ పోస్టులు 26, నేవీ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌(అబ్జర్వర్‌) పోస్టులు 22, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ పోస్టులు 18 పోస్టులు, లాజిస్టిక్స్‌ పోస్టులు 28, ఎడ్యుకేషన్‌ పోస్టులు 15, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌) పోస్టులు 38, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌) పోస్టులు 45, నేవీ కన్‌స్ట్రక్షన్‌ పోస్టులు 18 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Updated Date - Feb 18 , 2025 | 05:16 AM